🔱
Temple

🛕 Sri Lakshmi Nrusimha Swamy Temple

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ చరిత్ర

శ్రీ లక్ష్మినృసింహ పరబ్రహ్మణే నమః
కలియుగ ప్రారంభములో నారాయణ వనం సమీపములో – శ్రీ పద్మావతి దేవి యొక్క తండ్రిగారైన ఆకాశ రాజు పరిపాలన చేసేవారు. స్థానికుల కథనం ప్రకారం - పద్మావతి పరిణయానికి కొంత కాలం పూర్వం ఒకరోజు రాజుకు శ్రీ లక్ష్మీనృసింహ స్వామి స్వప్నములో దర్శనమిచ్చి - తాను ఈ ప్రదేశములో చతుర్భుజుడై శ్రీదేవి భూదేవి సమేతంగా కులువై వున్నాడని సెలవిచ్చాడు. ఆకాశరాజు ఈ ప్రదేశములో కొలువై వున్న స్వామివారిని దర్శించి వెంటనే (ప్రస్తుతము మనము చూసేడి) ఆలయ గర్భాలయాన్ని నిర్మించాడు అని ఛారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి. అంతే కాక స్థానికుల కథనం ప్రకారం - పూర్వము శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ ప్రదేశములో విహరించాడని, ప్రస్తుతము మనము చూసే కొలనులో స్నానం చేసేవాడని చెపుతారు. వరాహ పురాణం ప్రకారం ఆకాశరాజు ఇదే ప్రదేశంలో “అశ్వమేధ యాగం” చేశాడని, యాగానికి ముందు భూమి చదను చేయటానికి నాగలిని ఈ కొలనులో శుధ్ది చేశాడని ఈ ప్రాంతము “నాగిలేరు” అని అంటారని మనకు తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో వున్న కొండలపైన ఐదు కుంటలలో ఏర్పడిన ఊటలు నిండి క్రిందికి జారు నీరు – 365 రోజులు ప్రవహించే సహజ జలపాతంగా కొనేరుకు నీటిని అందిస్తూ వుంది. ఈ నీరు ప్రకృతి లోని వన వనరులను, కొండలలోనుంచి ప్రవహిస్తూ వున్నది కాబట్టి ఈ నీటిలో స్నానం చేస్తే చాలా చర్మ రోగాలకు ఉపశమనం కలుగుతుంది. అంతే కాక ఈ నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలో నిద్ర చేసిన భక్తుల కోరికలు తీరుస్తాడని స్థానికుల కథనం తెలుపుతూ వుంది.

ఈ విధంగా ప్రస్తుతము మనము చూసే శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయము నరసింహ అవతారానికి మరియు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కూడా సంబంధితమై వున్నదని, 2000 సంవత్సరాలకు పూర్వమే నిర్మాణం చేయబడిందని చరిత్ర పుటలు ఘోషిస్తూ వున్నాయి.

““శ్రీ లక్ష్మీనృసింహస్వామి ట్రస్ట్” వారు ఈ ఆలయ నిర్వహణ చూసుకుంటారు. ధర్మకర్త పి. గుణవంత రావు కుటుంబానికి నరసింహుడు కులదైవం. 1984లో ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేనప్పుడు తన స్వంత ఖర్చులతో ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు. క్రమేణా, 18 ఎకరాలలో విస్తరించిన తన స్వంత భూమిలో “శ్రీ లక్ష్మీనృసింహస్వామి ట్రస్ట్” నిర్వహణలో ఈ భవ్య దేవాలయాన్ని, “శ్రీ రాధాకృష్ణ గోశాల ట్రస్ట్” నిర్వహణలో 120 స్వదేశీ గోవులతో సంపన్నమైన గోశాలను, మరియు భక్తులకు మూడు పూటలా భోజన వసతి కలిపిస్తూ “శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆన్నదాన ట్రస్ట్” ఏర్పాటు చేశార. వారి తదనంతరం - కుమారులైన పి. గిరిబాబు మరియు పి. భాస్కరబాబు ధర్మకర్తలగా వ్యవహరిస్తూ ఆలయ అభివృధ్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ వున్నారు.

History of Sri Lakshmi Narasimha Swamy Temple

Sri Lakshmi Nrusimha Parabrahmane Namah

At the beginning of Kali Yuga, ‘Aakasha Raju’ (father of Sri Padmavati Devi) was the ruler of this area which is in and around the present-day Narayana Vanam. According to the locals, it is said that some time before the marriage of Padmavati, one day Sri Lakshmi Narasimha Swamy appeared to the king in his dream and said – that he was in this place, with four arms, and being worshipped together with Sridevi and Bhudevi as his dual consorts. Historical evidences suggest that Akasha Raju visited the Lord who was residing in this place and immediately built the temple’s sanctum-sanctorum or the garbha gruha (which we see today). Moreover, according to the local legends, Lord Venkateswara Swamy used to visit this place in the past and used to bathe in the pond that we see today. According to the Varaha Purana, we learn that Akasha Raju had performed the "Aswamedha Yagam" at this very place, and that before the yagam, he purified the plough in this pond to level the land, hence this place came to be known as "Nagileru". There are five springs atop the surrounding mountains of this temple, where water flows down continuously for 365 days of the year, thus forming an eternal and natural water falls, which becomes the source of water for the sacred pond. Since this natural spring water flows through the mountains, this water is very highly medicated and has been instrumental in curing skin diseases for hundreds of devotees taking bath in this sacred pool (named as Sri Lakshmi Nrusimha Teertham). It is also a very popular local belief that the devotees’ wishes get fulfilled when they sleep overnight in the temple premises.

Historical evidences suggest that Akasha Raju visited the Lord who was residing in this place and immediately built the temple’s sanctum-sanctorum or the garbha gruha (which we see today). Moreover, according to the local legends, Lord Venkateswara Swamy used to visit this place in the past and used to bathe in the pond that we see today. According to the Varaha Purana, we learn that Akasha Raju had performed the "Aswamedha Yagam" at this very place, and that before the yagam, he purified the plough in this pond to level the land, hence this place came to be known as "Nagileru".

There are five springs atop the surrounding mountains of this temple, where water flows down continuously for 365 days of the year, thus forming an eternal and natural waterfalls, which becomes the source of water for the sacred pond. Since this natural spring water flows through the mountains, this water is very highly medicated and has been instrumental in curing skin diseases for hundreds of devotees taking bath in this sacred pool (named as Sri Lakshmi Nrusimha Teertham). It is also a very popular local belief that the devotees’ wishes get fulfilled when they sleep overnight in the temple premises.

Thus, the pages of history proclaim that the Sri Lakshmi Narasimha Swamy Temple that we see today is related to the Narasimha incarnation and also the Kali Yuga daivam, Sri Venkateswara Swamy, and also that this temple was built more than 2000 years ago.

The temple is managed by the “Sri Lakshmi Narasimha Swamy Trust”. Lord Narasimha is the kula daivam for the family of the trustee, P. Gunavantha Rao. In 1984, when there were no facilities here, he arranged for the dhoopa-deepa-naivedyam for this temple at his own expense. Gradually, on his own land which is spread over 18 acres, he established this temple under the management of the “Sri Lakshmi Narasimha Swamy Trust”, and a cowshed with 120 swa-deshi cows under the management of the “Sri Radhakrishna Goshala Trust”, and also established the “Sri Lakshmi Narasimha Swamy Annadana Trust” to provide three meals a day to all the devotees. After his demise, his sons P. Giribabu and P. Bhaskarababu (who are also the Trustees) are working tirelessly for the constant development of the temple.

📞 Temple Contact Details

GiriBabu: 88970 92286

Bhaskar Babu: 72075 77287

Chakrapani: 91772 76596

📍 Sri Lakshmi Nrusimha Swamy Temple, Singirikona, Nagileru (V), NarayanaVanam (M), Tirupathi (Dist) - 517 581

Sri Lakshmi Nrusimha Swamy Temple
Scroll to Top